ACB Investigation : ఏసీబీ దర్యాప్తులో సంచలన విషయాలు

Update: 2020-09-10 07:12 GMT

 ACB Investigation : మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కైపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 లక్షలు రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇప్పుడు ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది. కాగా కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు చేస్తున్న దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నర్సాపూర్ ల్యాండ్ కేస్ లో మెదక్ మాజీ కలెక్టర్ ధర్మ రెడ్డి పాత్రకూడా ఉన్నట్టు తెలుస్తుంది. అప్పటి కలెక్టర్ ధర్మా రెడ్డి రిటైర్మెంట్ ముందు రోజు బాధితుడు మూర్తికి ఇవాల్సిన ఎన్వో సి ఫైల్ ఫై సంతకం చేసారు. అయితే అడిగిన అడిషనల్ కలెక్టర్ నగేష్ మాత్రం కలెక్టర్ తో సంతకం చేయిస్తా అని చెప్పి బాధితుడు మూర్తి నుండి కలెక్టర్ వాటా కూడా డిమాండ్ చేసారు. దీంతో కలెక్టర్ ధర్మా రెడ్డి పాత్ర పై ఏసీబీ ప్రస్తుతం ఆరాతీస్తుంది.

ఇక ఇప్పటికే ఏసీబీ అధికారులు 112 ఎకరాల భూమికి ఎన్ వో సి కోసం 1 కోటి 12 లక్షల లంచం కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ అరెస్ట్ చేసారు. 20 కోట్లు విలువ చేసే భూమి కి ఎన్ వో సి ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన అడిషనల్ కలెక్టర్, తహశీల్దార్ , ఆర్ డి వో, జూనియర్ అసిస్టెంట్ లను కూడా ఏసీీ అరెస్ట్ చేసారు. తాజాగా ఐఏఎస్ ధర్మా రెడ్డి పాత్ర పై లోతుగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మా రెడ్డి జులై 31న రిటైర్ అయ్యారు. అదే రోజు చిలిపిచేడ్ గ్రామంలోని సర్వే నెంబర్ 58, 59 లోని వివాదస్పద 112.21 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో నుంచి తీసివేయాలని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కు మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మా రెడ్డి లేక రాసారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం 112.21 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్ కు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఆదేశాలు జారీచేసారు. రిటైర్మెంట్ రోజునే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ కు లేఖ రాయడంతో కలెక్టర్ ధర్మా రెడ్డి పాత్ర పై అనుమానాలు వ్యాక్తం అవుతున్నాయి. దీంతో రిటైర్డ్ కలెక్టర్ ధర్మా రెడ్డి పాత్ర పై ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News