GST Scam: GST స్కాంలో సంచలన విషయాలు
GST Scam: దేశ వ్యాప్తంగా 2600 బోగస్ కంపెనీలు గుర్తింపు
GST Scam: Gst స్కాం లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా 2,600 బోగస్ కంపెనీలు భాగస్వామ్యం అయినట్లు గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా 10వేల కోట్లకు పైగా స్కాం జరిగింది. హైదరాబాద్ లో 326పైగా బోగస్ కంపెనీలను GST విభాగం గుర్తించింది. రాత్రికి రాత్రి బోగస్ గోదాములను GST ఫేక్ బిల్లింగ్ మాఫియా సృష్టించింది. ఇతరుల ఆధార్, పాన్ కార్డులతో GST రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందారు.
ఎలాంటి స్టాక్ లేకుండా 4 నుండి 6శాతానికి బోగస్ కంపనీ ల నుండి బిల్స్ ను వ్యాపారులు కొంటున్నారు. బోగస్ కంపనీ ల నుండి కొంటున్న బిల్స్ ని 15 నుండి 18 శాతానికి వ్యాపారవేత్తలు అమ్ముతున్నారు. బిల్స్ లేకుంటే స్టాక్ ను కంపెనీలు రిజెక్టు చేస్తున్నాయి. దీంతో GST మాఫియా బోగస్ కంపెనీలు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నాయి.