Self Lockdown: భాగ్యనగరంలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధిస్తున్న కాలనీలు
Self Lockdown: కరోనా కేసుల సంఖ్య తగ్గాలి అంటే జనసంచారం ఉండకూడదని ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.
Self Lockdown: కరోనా కేసుల సంఖ్య తగ్గాలి అంటే జనసంచారం ఉండకూడదని ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కానీ కొందరు లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించి బయట తిరుగుతున్నారు. ఐతే భాగ్యనగరంలో కొన్ని కాలనీలు స్వచ్చంధంగా లాక్‌డౌన్ విధించుకొని ఆదర్శంగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని కార్ఖానా ప్రాంతంలోని కాలనీలు. కరోనా కారణంగా ఈ కాలనీవాసులు బయటకు వెళ్లరు. తమ దెగ్గరికి ఎవ్వరిని రానివ్వకుండా స్వచ్చంధంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. కాలనీ మెయిన్ గేట్లకు తాళాలు వేసి ఇతరులు వచ్చే వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని కార్ఖానా ప్రాంతంలోని విక్రమ్ పురి, పీ ఎండ్ టీ , వాసవీ నగర్‌తో పాటు ఇతర కాలనీలు స్వచ్చంధంగా లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. లాక్‌డౌన్ రిలాక్సేషన్ టైంలో కూడా బయటి వ్యక్తులు వచ్చే అనుమతి లేకుండా ఖచ్చితంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు.
ఇక కొన్ని కాలనీలు పాటిస్తున్న స్వచ్చంధ లాక్‌డౌన్‌కు అభినంధనలు వెలువెత్తుతున్నాయి. స్ధానికంగా ఉండే వ్యక్తులు ఇలా లాక్‌డౌన్ చేసేకోవడం మంచిదని కరోనాను తరిమికొట్టే విధంగా ఇలాంటి చర్యలు అందరూ తీసుకోవాలని ప్రజలు అంటున్నారు. ఏదేమైనా లాక్‌డౌన్ నిబంధనలు గాలికొదిలేసి తిరుగుతున్న కొందరు ఆకతాయిలు ఇలా స్వచ్చంధంగా లాక్‌డౌన్ పాటిస్తున్న వారిని చూసి బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం.