Schools Reopen: తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం యధాతథం
Schools Reopen: రెసిడెన్షియల్ మినహా ఇతర పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి
Schools Reopen: తెలంగాణలో రేపటి నుంచి పాఠశాలలు యధాతథంగా ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ గురుకుల విద్యాలయాలు మినహా ఇతర విద్యాసంస్థలు ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ తరగతులను కొనసాగించనున్నారు. ప్రత్యక్ష బోధన కోసం పాఠశాలలకు రావాలని విద్యార్ధులను బలవంతం చేయవద్దని హై కోర్టు సూచించింది. వారం రోజుల్లో పాఠశాల విద్యాశాఖ ప్రత్యక్ష తరగతుల నిర్వహాణపై SOP మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాకను ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్ధులపై చర్యలు తీసుకోవద్దని, అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది.