TRSలో కొనసాగుతున్న పదవుల పందేరం.. మూడు రాజ్యసభ స్థానాల కోసం మొదలైన రేస్

TRS: మూడు రాజ్యసభ స్థానాల కోసం మొదలైన రేస్

Update: 2022-05-13 02:58 GMT

గులాబీ బాస్ కేసీఆర్ జాబితాలో ఎవరు ఉన్నారు ?

Telangana: TRSలో పదవుల పందేరం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీల భర్తీ ముగిసిందో లేదో ఇప్పుడు అందరి దృష్టి రాజ్యసభ స్థానాలపై పడింది. శాసన మండలిలో 19 ఎమ్మెల్సీల భర్తీ పూర్తి అయిందో లేదో మూడు రాజ్యసభ స్థానాల కోసం రేస్ మొదలయింది. బండ ప్రకాష్ రాజీనామా తో ఒకటి, జూన్ లో డీ.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు పదవీకాలం పూర్తవుతుండడంతో మొత్తం మూడు స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఇప్పుడు ఆశావహులు గులాబీ బాస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

బండ ప్రకాష్ స్థానానికి ఇప్పటికే నామినేషన్ పర్వం కూడా మొదలు అవ్వగా మిగితా రెండు స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. మే 31కి నామినేషన్లకు చివరితేదీ.. దీంతో ఈసారి ఎలా అయినా అవకాశం దక్కించుకోవాలని పార్టీలోని మాజీలు, సీనియర్లు సీరియస్‌గా ట్రై చేస్తున్నారు.

కొద్దికాలంగా సీనినటుడు ప్రకాష్ రాజ్ పేరు టీఆర్ఎస్ పరిశీలనలో ఉన్నట్టు తెసుస్తోంది. కరీంనగర్ మాజీ ఎంపీ ప్రణాళిక సంగం ఉపాధ్యక్షుడు వినోద్ కు ఈసారి రాజ్యసభ పక్కా అంటున్నాయి పార్టీ వర్గాలు. ఢిల్లీలో వినోద్ సేవలు అవసరమని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మిగితా రెండు స్థానాల మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బూరనర్సయ్య గౌడ్ తో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు సీఎల్ రాజాం, ఒక పత్రిక ఎండీ దామోదర్ రావులతో పాటు ఎమ్మెల్సీ రాని వాళ్ళు సైతం ఎంపీ అవకాశం కోసం గట్టిగానే పైరవీలు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు కూడా రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారని సమాచారం. బీజేపీలో ఉన్నప్పుడు గవర్నర్ పదవి ఆశించిన నర్సింహులు టీఆర్ఎస్‌లో ఎంపీ పదవి రాకపోతుందా అనే ధీమాలో ఉన్నారట. ఇలా ఎవరికీవారు ఎంపీ పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు నేతలు.

మొత్తానికి గులాబీ బాస్ కేసీఆర్ జాబితాలో ఎవరు ఉన్నారు అన్నది అసలు కథ. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఫైనల్ లో జరిగిన ట్విస్ట్ లు చూస్తే ఇది కూడా అలానే ఉండే అవకాశం ఉంది. మరీ కేసీఆర్ ఎవరిని పెద్దల సభకు పంపిస్తారో చూడాలి. 

Tags:    

Similar News