11 ఏళ్ల తరువాత అద్భుత దృష్యం

Saral Project Siphons : సుమారు 11ఏండ్ల నుంచి వనపర్తి జిల్లా మదనాపూర్‌ మండల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరళాసాగర్‌ ప్రాజెక్టు సైఫన్లు తెరుచుకున్నాయి.

Update: 2020-08-16 05:57 GMT
sarala project File Photo

Saral Project Siphons : సుమారు 11ఏండ్ల నుంచి వనపర్తి జిల్లా మదనాపూర్‌ మండల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరళాసాగర్‌ ప్రాజెక్టు సైఫన్లు తెరుచుకున్నాయి. రాష్ట్రంలో నాలుగైదు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన ఏడు వుడ్‌ సైఫన్లు తెరుచుకున్నాయి. సైఫన్లతో నిర్మించిన సరళా ప్రాజెక్టు ప్రపంచంలో రెండోది కాగా, ఆసియాలో మొదటిది. సరళా సాగర్ ప్రాజెక్టు వనపర్తి జిల్లాలోని మదనాపూర్ మండలంలోని శంకరమ్మ పేట గ్రామంలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్వం వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజులలో ఒకడైన రెండవ రామేశ్వరరావు కాలంలో సరళాదేవి పేరు మీదుగా ఒక చెరువులా నిర్మించారు దీని నిర్మాణం కోసం రామేశ్వరరావు-II ఇంజనీర్ లను అమెరికా లోని కాలిఫోర్నియా కు పంపించి అధ్యయనం చేసిన తర్వాత శంకరమ్మపేట లో నిర్మాణం చేపట్టారు. సరళసాగర్ ప్రాజెక్ట్ ను 1949 సెప్టెంబర్ 15 న ఆనాటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జనరల్ జయంతో నాథ్ చౌదరీ చేతుల మీదుగా ప్రారంభం అయింది.

దీని సామర్థ్యం 0.42 టీఎంసీ ఈ ప్రాజెక్టు కింద 9 గ్రామాలకు సాగు నీరు అందుతుంది అనేక మంది కి వ్యవసాయ, మత్స్య కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. దీనినే ఆధునీకరించి 1959 జూలై 26 వ తేదిన సరళా సాగర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. అప్పటి పి. డబ్ల్యూ . డి. శాఖామంత్రి జె.వి. నర్సింగరావు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 1964 సెప్టెంబర్ లో కుడివైపు గండి పడితే కొంత భాగాన్ని రాతి తో ఆనకట్ట పునర్నిర్మించారు తదనంత కాలంలో బుర్ర వాగు ఇతర వాగుల నుంచి వచ్చే ప్రవాహాలు అనావృష్టి కారణంచే ఆగి పోవడం జరిగింది కాలక్రమేణా సరళ సాగర్ ప్రాజెక్ట్ మరుగున పడిపోయింది.ఇది వర్షాధార ప్రాజెక్టు కావడం మూలాన ఆ సమస్యను అధిగమించడానికి, నిరంతరం నీటితో ఉండటానికి ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్ పాడ్ బ్యాలెనిసింగ్ రిజర్వాయర్ ద్వారా 12 కోట్ల రూపాయల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని 2008 లో గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డా. జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. దాదాపు పదకొండు సంవత్సరాల పాటు అనేక మంది రైతుల పంటలకు నీరు అందించింది.కానీ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కొరవడడంతో 2019 డిసెంబర్ 31 ఉదయం 6:15 ని సమయంలో సరళ సాగర్ కు ఎడమవైపు భారీ గండి పడింది దీనితో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు 2020ఆగస్ట్ నాటికి గండిని పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది.

ఆటోమేటిక్‌ సైఫన్‌ సిస్టం అంటే.. ప్రాజెక్టు లోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకోవడం అని అర్థం. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే రెండో ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 17 హుడ్ సైఫన్ లను, 4 ప్రైమింగ్ సైఫన్ లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రైమింగ్ సైఫన్ ద్వారా సెకన్ కు 2000 (రెండు వేల) క్యూసెక్ ల నీటిని బయటికి పంపితే, ఒక్కో హుడ్ సైఫన్ ద్వారా 3440 క్యూసెక్ ల నీటిని బయటికి పంపుతారు. ప్రాజెక్టులోకి పూర్తి స్థాయి నీటి మట్టం చేరినప్పుడు గాలి పైపుల ద్వారా ఏర్పాటు చేసిన సైఫన్ లు ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. 520 ఫీట్ల రాతి కట్టడం, 3537 ఫీట్ల మట్టి కట్టడం ఈ ప్రాజెక్టులో అంతర్భాగం.


 





Tags:    

Similar News