సమ్మే ఎఫెక్ట్ : ఆటోవాలాల అడ్డగోలు దోపిడి

Update: 2019-10-19 10:20 GMT

తెలంగాణలో 15 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే.. దీనితో ఇన్ని రోజులు తాత్కాలిక ఉద్యోగులతో అరకొర బస్సులతో బస్సులను నడిపించింది ప్రభుత్వం..అయితే బస్సులు లేని టైం చూసి ఆటోవాలాలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. తమనోటికి ఎంతోస్తే అంత చెబుతున్నారు. అమీర్పేట్ నుండి పెద్దమ్మ గుడి టెంపుల్ కి వెళ్ళాలంటే దాదాపుగా వంద నుండి 150 రూపాయలు అడుగుతున్నారు.

ఇది పక్కన పెడితే ఇది మరో ఘోరం 'ఖైరతాబాద్ నుంచి ఎర్రమంజిల్ వరకు రూ.70 అడుగుతున్నారు. వాస్తవానికి 'ఖైరతాబాద్ నుంచి ఎర్రమంజిల్ కేవలం ఒకటే కిలో మీటర్ కానీ ఇంత డబ్బులు వసూలు చేయడం ఏంటి అని సామాన్యులు అడుగుతున్నారు . బస్సులు లేకపోవడం, దీనికి తోడు ఇవాళ్టి నుంచి ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఆటోవాలాలు ఇదే మంచి సమయం అని అడ్డగోలుగా దోచుకుంటున్నారు.  

Tags:    

Similar News