హైదరాబాద్‌లో వరదలు తగ్గిన వెంటాడుతున్న కష్టాలు

Update: 2020-11-02 06:41 GMT

హైదరాబాద్‌లో వరదలు తగ్గిన కష్టాలు వెంటాడుతున్నాయి. భారీ వర్షాలకు నగర రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఏ మార్గంలో వెళ్లినా ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు హడలిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్లిన వారు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేక గుంతలు పడ్డ రోడ్డులో ప్రయాణించి చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు.

హైదరాబాద్‌లో వరదలు తగ్గిన రహదారులు వణుకు పుట్టిస్తున్నాయి. ఉప్పల్ వైపు రావాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఉప్పల్ నుండి వరంగల్ వెళ్లే రోడ్డు పరిస్థితి చూసి ప్రజలు హడలిపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు వారం రోజులు నల్ల చెరువు కట్ట పై వరద నీరు ప్రవహించింది. దీంతో చుట్టూ అక్కడి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దుమ్ము ధూళితో చాలా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, చిరు వ్యాపారులు చెబుతున్నారు.

రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బొడ్డుప్పల్ నుండి ఉప్పల్ x రోడ్డు వరకు వెళ్లాలంటే దాదాపు గంట సమయం పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కనీసం తాత్కాలిక మరమ్మత్తులు కూడా చేయడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు కూడా ఎక్కడ కనిపించడం లేదని మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైన స్పందించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Full View


Tags:    

Similar News