Hyderabad: ఎర్రగా మారిన వీధి రోడ్లు.. షాకైన జనం

Hyderabad: హైదరాబాద్‌ సుభాష్‌నగర్‌లో ఎరుపు రంగు నీరు కలకలం

Update: 2024-11-26 05:19 GMT

Hyderabad: ఎర్రగా మారిన వీధి రోడ్లు.. షాకైన జనం

Hyderabad: హైదరాబాద్‌ జీడిమెట్ల పారిశ్రామికవాడకు ఆనుకొని ఉన్న సుభాష్‌నగర్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌లో గత రాత్రి నుంచి మ్యాన్‌హోల్‌ నుంచి ఎరుపురంగు నీరు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జీడిమెట్ల పారిశ్రామికవాడ రసాయనాలను.. గోదాముల నిర్వాహకులు డ్రైనేజీలో కలుపుతున్నారని, దానివల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

డ్రైనేజీ నిండిపోయినప్పుడల్లా రంగు నీరు వస్తుందని చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. కెమికల్‌ వాటర్‌..? లేదా రంగు నీళ్లా..? అనే అంశంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

Full View


Tags:    

Similar News