Himachal Pradesh: విరిగిపడిన కొండచరియలు.. చూస్తుండగానే కొట్టుకుపోయిన నేషనల్ హైవే
Himachal Pradesh: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
Himachal Pradesh: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం కొనసాగుతోంది. తాజాగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఏకంగా ఓ నేషనల్ హైవేనే కొట్టుకుపోయింది. సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో కళ్ల ముందే, కొండ చరియలు కూలిపోతూ రోడ్డుతో సహా లోయలోకి కూరుకుపోయింది.
లాండ్ స్లైడింగ్ కారణంగా కొండలోని పెద్ద భాగంతోపాటు రోడ్డు సైతం లోయలోకి కూరుకుపోవడం ఇటీవలి కాలంలో చూడలేదు. కొండ చరియలు విరిగి పడటానికి కొద్ది దూరంలో వాహనాలను నిలిపేయడంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.