Peddapalli: పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం
Peddapalli: డీసీఎం వ్యాన్, స్కార్పియో వాహనం ఢీ
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్, స్కార్పియో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు. స్కార్పియో వాహనం కరీంనగర్ వెళ్తుండగా అదుపుతప్పి పైపుల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.