జనగామ జిల్లా పెంబర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి

Road Accident: ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొన్న మరో ఇసుక లారీ

Update: 2023-06-06 05:13 GMT

జనగామ జిల్లా పెంబర్తి వద్ద రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి 

Road Accident: జనగామ జిల్లా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెంబర్తి వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి మరో ఇసుక లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జేసీబీ సాయంతో రోడ్డుపై ఉన్న వాహనాలను తొలగించారు.

Tags:    

Similar News