మావోల కోటలో తిరుగుబాటు మొదలైందా?

Update: 2020-10-07 07:33 GMT

మావోల కోటలో తిరుగుబాటు మొదలైంది. అన్నలను ఆదరించే ప్రాంతాలలో వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. పోస్టర్లలో మావోయిస్టు నాయకుడు బాస్కర్ ను టార్గేట్ చేయడానికి కారణాలేంటి..? మావోయిస్టు వ్యతిరేక పోస్టర్ల వెనుక పాత్రదారులేవరు..? సూత్రదారులేవరు..? ఉమ్మడి ఆదిలాబాద్ లో కలకలం రేపుతున్నా మావోయిస్టు వ్యతిరేక పోస్టర్ల పై హెచ్ఎంటీవీ స్పేషల్ రిపోర్టు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా తెలంగాణలో మావోయిస్టు కోటను పునర్ నిర్మించాలని అన్నల ఎత్తుగడలకు ఆదిలోనే వ్యతిరేకత మొదలవుతోంది. బోథ్, నేరడిగోండ, ఇచ్చోడ మండలాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. ప్రధానంగా కుమ్రంబీమ్, మంచిర్యాల కార్యదర్శి బాస్కర్ పురిటిగడ్డ ప్రాంతంలో వ్యతిరేక పోస్టర్లు వెలువడటం విశేషం.

పలుచోట్ల వెలసిన పోస్టర్లలో మావోయిస్టులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. కొరియర్ల ముసుగులో మావోయిస్టు నాయకుడు భాస్కర్, వర్గీస్, రాము, లింగవ్వ ముఠాగా ఏర్పడి వ్యాపారులు, కాంట్రాక్టుల వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని పోస్టర్లలో పొందుపరిచారు. మావోయిస్టుల మనుగడ కోసం అమాయకపు ఆదివాసి గిరిజనులను బలవంతంగా పార్టీలో చేర్చుకుంటున్నారని కూడా పోస్టర్ల ద్వారా అభియోగించారు. అలాగే తమ సమాచారం పోలీసులకు అందిస్తున్నారని గిరిజనులపై కోవర్టులుగా ముద్ర వేసి హతమార్చుతున్నారని ఆరోపించారు. గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అన్నలు అడ్డుకుంటున్నారని కూడా ఈ పోస్టర్ల ద్వార విమర్శించారు.

ఆదివాసి గిరిజనులను మేలుకొలుపుతూ వెలసిన ఈ పోస్టర్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నల నుంచి ఆదివాసీలకు దూరం చేయాలనే గిట్టనివారెవరో ఇలా చేయించి ఉంటారని ప్రచారం ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మావోయిస్టు సానుభూతిపరులు కోరుతున్నారు.

Tags:    

Similar News