Revanth Reddy: తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Revanth Reddy: ఎనిమిదేళ్లుగా దేశం నిర్భందంలో ఉందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు.
Revanth Reddy: ఎనిమిదేళ్లుగా దేశం నిర్భందంలో ఉందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. దేశంలో భావస్వేచ్ఛే కాదు... బతికే స్వేచ్ఛ కూడా కరవైందని ఆక్షేపించారు. ఈ మేరకు తెలంగాణ సమాజానికి రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులంటున్నారని లేఖలో మండిపడ్డారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పతనమైందని దుయ్యబట్టారు. ఆకలి సూచిలో 107వ స్థానానికి దేశం దిగజారిందని వాపోయారు.
తెలంగాణ పాలన ఫాంహౌస్‌కే పరిమితమైందన్నరేవంత్ బీజేపీ అరాచకాలకు టీఆర్ఎస్ 8 ఏళ్లు వంతపాడిందని ఆరోపించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినీతి ప్రపంచ రికార్డులను బద్ధలు కొడుతోందన్నారు. ఈ దుస్థితిని ప్రశ్నిస్తూ అందర్నీ ఏకం చేస్తూ రాహుల్ 'భారత్ జోడో యాత్ర'గా బయలుదేరారని గుర్తు చేశారు. 'భారత్ జోడో యాత్ర' రేపు హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తోందన్నారు.