Revanth Reddy: TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై రోజుకో మాట మాట్లాడుతున్నారు
Revanth Reddy: గతంలో మాదిరి ఈ ప్రశ్నాపత్రాల లీకేజీల్లో.. ప్రభుత్వ పెద్దలు ఉండొచ్చు
Revanth Reddy: TSPSC పేపర్‌లీకేజీ విషయంలో పెద్దల హస్తం ఉందన్న అనుమానం రేకెత్తుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గతంలో సింగరేణి, ఎంసెట్ పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లే.. ఈ పేపర్ లీకేజీలోనూ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని భావిస్తున్నామన్నారు. TSPSC పేపర్ లీకేజ్‌లో ప్రభుత్వం రోజుకో మాట చెప్పుతుందని.. మొదట ప్రశ్నాపత్రం హ్యాక్ అయ్యిందని.. ఆ తర్వాత హనీ ట్రాప్‌కు గురైందని.. ఇప్పుడు తాజాగా లీకేజ్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దలను కాపాడేందుకు ఫిర్యాదు చేయడం లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.