గత ఎన్నికల ఓటమికి బదులు తీర్చుకుంటున్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్ విస్తృత ప్రచారం నిర్వహించినా ఫలితం శూన్యం

Revanth Reddy: రౌండ్ రౌండ్‌కు పెరుగుతున్న రేవంత్ రెడ్డి మెజార్టీ

Update: 2023-12-03 06:22 GMT

గత ఎన్నికల ఓటమికి బదులు తీర్చుకుంటున్న రేవంత్ రెడ్డి.. కేటీఆర్ విస్తృత ప్రచారం నిర్వహించినా ఫలితం శూన్యం    

Revanth Reddy: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి రేవంత్ రెడ్డి బదులు తీర్చుకునేలా కనిపిస్తున్నారు. 15 వేల 97 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. కొడంగల్‌లో ఈ సారి కూడా బీఆర్ఎస్ సత్తా చాటాలనుకున్నా.. కారు పార్టీ ఆశలు అడియాశలే అయ్యాయి. కొడంగల్ ప్రజలు ఈ సారి రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు.

మంత్రి కేటీఆర్ కొడంగల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహించిన ఫలితం లేనట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రచారం చేసిన కొడంగల్ మాత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికే జై కొట్టింది. గత ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓడిపోయిన సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి రెండూ రేవంత్ రెడ్డి కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News