Revanth Govt : పేదలకు షాకిచ్చిన రేవంత్ సర్కార్..ఊహించలేని పరిణామం

Revanth Govt : ప్రభుత్వాలు మారినప్పుడల్లా..పథకాల్లో కొన్ని రద్దు చేయడం లేదంటే మార్పులు చేర్పులు చేయడం చేస్తుంటారు. కొత్తపథకాలను తెస్తుంటారు.అయితే పథకాలను రద్దు చేసినప్పుడు..వాటిని పొందాలనుకున్న లబ్దిదారులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. మరి ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో చూద్దాం.

Update: 2024-06-24 04:00 GMT

 Revanth Govt : పేదలకు షాకిచ్చిన రేవంత్ సర్కార్..ఊహించలేని పరిణామం

Revanth Govt : ఏదైనా సమస్య ఉంటే..ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఒక సమస్యకు మరో సమస్యను సాకుగా చూపకూడదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది కూడా అలాగే ఉంది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగాయని..వాటిలో అక్రమాలను సరిచేయకుండా..ఏకంగా ఆ స్కీమునే రద్దు చేసింది. ఫలితంగా ఈ పథకం ద్వారా గొర్రెలు పొంది..జీవనోపాధి పొందాలనుకున్న పేద ప్రజలకు మాత్రం సర్కార్ నిరాశే కలిగించిందని చెప్పవచ్చు.

రాష్ట్రంలో యాదవ, కురుమ వర్గాలకు చెందినవారికి గత బీఆర్ఎస్ సర్కార్ సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేసింది. ఈ పథకం ద్వారా లక్షలాది మంది గొర్రెలను పొందారు. దాంతో తెలంగాణలో గొర్రెల పెంపకం పెరిగింది. చాలా పథకాల వలే ఈ పథకంలో కూడా భారీ అవినీతి జరిగింది. దానిపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇక ఈ పథకాన్ని కొనసాగించడం సరికాదని భావించిన సర్కార్..రెండో విడతలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆపేసింది.

2017లో ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడత పూర్తి స్థాయిలో, రెండో విడత పాక్షికంగా జరిగింది. 2017 నుంచి 2019 వరకు దాదాపు 90 లక్షల గొర్రెలను మొదటి విడతలో పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకం ద్వారా కొంతమంది పశుసంవర్ధకశాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డారని తేలింది. ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందిని అరెస్టు చేశారు. పోలీసులతోపాటు, ఈడీ కూడా దర్యాప్తు చేసి రూ. 700కోట్లు చేతులు మారినట్లు తేల్చింది. ఈ స్కీం అమలు సవాలుగా మారింది. వాళ్లు చేసిన తప్పుడు పనికి..అన్యాయంగా పేదలు ఈ పథకాన్ని కోల్పోవల్సి వచ్చింది.

రెండో విడతలో గొర్రెల కోసం ఒక్కో లబ్దిదారుడు తన వాటా డబ్బు కింద రూ. 43, 750ని చెల్లించారు. గొల్లకురుమల ఆర్థికాభివృద్ధి కోసం పథకం ప్రారంభంలో యూనిట్ ధర రూ. 1.25 లక్షలుగా నిర్ణయించారు. ఆ తర్వాత ధరను రూ. 1.75 లక్షలకు పెంచారు. జిల్లాలో 18 ఏండ్లు నిండిన గొల్లకురుమలను సభ్యులుగా చేర్చుకుని డ్రా పద్ధతిలో లబ్దిదారులను సెలక్ట్ చేశారు. ఒక యూనిట్ ధరరూ. 1.25 లక్షలు ఉండగా..అందులో 75శాతం సబ్సిడీ ఇవ్వగా..25శాతం లబ్దిదారులు చెల్లించారు. ఇప్పుడు యూనిట్ రూ..175 లక్షలు అవ్వడంతో లబ్దిదారులు రూ. 43, 750 చొప్పున చెల్లించారు.

కాగా ఇప్పుడు ఈ స్కీం రద్దవ్వడంతో ఇప్పటికే డబ్బు చెల్లించిన లబ్దిదారులకు ప్రభుత్వం ఆ డబ్బును వెనక్కి ఇస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో రెండు వారాల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపారు. తాము ఏ తప్పూ చేయకునప్పుడు..తామెందుకు ఈ పథకం పొందకుండా నష్టపోవాలని లబ్దిదారులు అడుగుతున్నారు. ప్రభుత్వం దీనిపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News