Revanth Reddy: తెలంగాణలో షర్మిల నాయకత్వం సహించేది లేదు
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికపై రేవంత్ రెడ్డి రుసరుస
Revanth Reddy: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ప్రస్తావనపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చిట్ ఛాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రపోలువచ్చి... తెలంగాణలో పెత్తనం చేస్తామంటు సహించేది లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామంటే సాదరంగా స్వాగతిస్తామన్నారు. అలాగే... ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చీఫ్ అయితే... సహచర పీసీసీ చీఫ్ గా ఆమెతో సంప్రదిస్తామన్నారు. తెలంగాణలో షర్మిల నాయకత్వానికి తావులేదన్నారు.