Revanth Reddy: అగ్నిపథ్‌ను వెనుక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది

Revanth Reddy: దేశంలో యువతను ఆందోళనకు గురిచేసిన పరిస్థితులకు కారణమైన అగ్నిపథ్ పథకాన్ని త్వరితగతిన రద్దుచేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2022-06-26 13:54 GMT

Revanth Reddy: అగ్నిపథ్‌ను వెనుక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది

Revanth Reddy: దేశంలో యువతను ఆందోళనకు గురిచేసిన పరిస్థితులకు కారణమైన అగ్నిపథ్ పథకాన్ని త్వరితగతిన రద్దుచేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ రక్షణ, సైనిక నియామకాలపట్ల అవగాహన రాహిత్యంతో ప్రధాని మోడీ సరికొత్త పథకాలను అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపడుతున్నామని తెలిపారు. అగ్నిపథ్ ను వెనుక్కి తీసుకునేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు దీక్షలు కొనసాగనున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కూడా దీక్షలు కొనసాగనున్నాయి. మల్కాజిగిరి చౌరస్తాలో జరిగే దీక్ష కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 

Tags:    

Similar News