Revanth Reddy: ధరణి పోర్టల్‌తో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
Revanth Reddy: ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించి.. తమ పేరు మీదికి మార్చుకుంటున్నారు
Revanth Reddy: ధరణి పోర్టల్‌తో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు కోదండరెడ్డి, సంపత్‌కుమార్ తదితరులతో కలిసి రేవంత్ భూమి డిక్లరేషన్ విడుదల చేశారు. ప్రజలు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోందన్న రేవంత్‌రెడ్డి..ధరణి పోర్టల్ వెనుక పెద్ద మాఫియా దాగుందన్నారు. దీనిపై ఆధారాలతో సహా సీరియల్‌గా బయటపెడతానని రేవంత్‌రెడ్డి తెలిపారు.