Hyderabad Exhibition: హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్ డేట్, టికెట్స్, ఫుల్ డీటేల్స్

Numaish Exibition to Begin from january 3rd: నుమాయిష్-2025ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

Update: 2024-12-30 10:15 GMT

Numaish Exibition to Begin from january 3rd 2025: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 3వ తేదీ నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ 84వ ప్రదర్శన ప్రారంభంకానుంది. నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలువురు వ్యాపారవేత్తలు తమ వస్తువులను విక్రయించేందుకు స్టాళ్లను బుక్ చేసుకున్నారు. సుమారు 2 వేల స్టాళ్లలో పలు రకాల వస్తువులు, దుస్తులు, తినుబండారాలను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేయనున్నారు.

ప్రతీ ఏటా జనవరిలో ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌కు ప్రతీరోజు వేలమంది సందర్శకులు వస్తుండడంతో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని రకాలుగా అనుమతులు తీసుకున్న తర్వాతనే దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఫుడ్ స్టాళ్లతో పాటు అనేక రకాలైన వస్తువులు ఈ ఏడాది ఎగ్జిబిషన్‌లో (Hyderabad Exhibition in January 2025 ) అలరించనున్నాయి.

జనవరి 1వ తేదీనే ఎగ్జిబిషన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం, సంతాప దినాల కారణంగా 3వ తేదీకి వాయిదా వేసినట్టు ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ వెల్లడించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శులు బి.సురేందర్ రెడ్డి, మోహన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. నుమాయిష్-2025ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ సారి నుమాయిష్‌లో 2 వేల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మినీ ట్రైన్‌తో పాటు డబుల్ డెక్కర్ బస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. 24 గంటల పాటు నుమాయిష్‌లో (Numaish)వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సందర్శకుల భద్రత కోసం పోలీసులతో పాటు వాలంటీర్లు, వాచ్ అండ్ వార్డు కార్యకర్తలు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను, వందకు పైగా సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామన్నారు.

నుమాయిష్ ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు, వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రవేశ రుసుమును రూ.40 నుంచి రూ.50కి పెంచామన్నారు. మినీ ట్రైన్ టికెట్‌ను రూ.30, డబుల్ డెక్కర్ బస్సు టికెట్ రూ.40 గా నిర్ణయించినట్టు ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ తెలిపారు.

Tags:    

Similar News