Mahender Reddy: పదవీ విరమణ చేసిన మహేందర్ రెడ్డి
Mahender Reddy: ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలకు.. పోలీసులున్నారనే నమ్మకాన్ని కల్పించాం
Mahender Reddy: తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నామని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశం చేసి శాంతిభద్రతలకు పెద్దపీట వేశారని చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్కు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు.