అనురాగ్‌శర్మ పదవీకాలం పొడిగింపు

Update: 2020-11-09 03:04 GMT

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అనురాగ్‌ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీకాలం ఈ నెల 12తో ముగియనుండగా, మరో మూడేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12 నుంచి మూడేండ్లపాటు శాంతిభద్రతల ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతారని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులుజారీ చేశారు. పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ అంశాల సలహాదారుడిగా అనురాగ్‌ శర్మ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా పని చేసిన ఆయన 2017లో పదివీ విరమణ పొందారు.

Tags:    

Similar News