Restrictions Lifted On Wine Shop : తెలంగాణలో మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేత!
Restrictions Lifted On Wine Shop : కరోనాని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..
Restrictions Lifted On Wine Shop : కరోనాని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీంతో అన్ని చోట్లల్లో మద్యం దుకాణాలు బంద్ అయిపోయాయి. పలు చోట్లల్లో మద్యం దొరకక మందుబాబులు నానా తిప్పలు పడ్డారు. ఇక పలు నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మే 6వ తేదీ నుంచి మద్యం అమ్మకాలకి అనుమతి ఇచ్చింది. మొదటగా లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఇచ్చింది. ఇక ఆ తర్వాత నిబంధనలో స్వల్ప మార్పులు చేస్తూ.. రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతిచ్చింది.
ఇక నెల రోజుల తర్వాత జులై 2న మరోసారి ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ.. రాత్రి 9:30 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతిచ్చింది. ఇక ఈరోజు (ఆగస్టు 3) వ తేదిన మద్యం దుకాణాలపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరపవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక తెలంగాణలో కొత్తగా 983 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో కొత్తగా మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 67,660 కి చేరింది. మృతుల సంఖ్య 551 కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 1019 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా..కరోనా నుంచి కోలుకోని మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 48,609 కి చేరింది. ప్రస్తుతం 18,500 మంది చికిత్స పొందుతున్నారు.