CAG Report: 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాగ్ రిపోర్ట్ విడుదల

CAG Report: తెలంగాణ ఆదాయం అంచనా రూ.2,21,687 కోట్లు

Update: 2023-08-06 14:03 GMT

CAG Report: 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాగ్ రిపోర్ట్ విడుదల   

CAG Report: 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాగ్ రిపోర్ట్ విడుదల చేసింది. తెలంగాణ ఆదాయం అంచనా 2 లక్షలా 21వేల 687 కోట్లుగా ఉంటే.. లక్షా 74వేల 154 కోట్లు ఆదాయం వచ్చినట్లు కాగ్ రిపోర్టులో పేర్కొంది. కాగ్ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు 6వేల 744 కోట్లు ఉంటే...అది 9వేల 335 కోట్లకు పెరిగింది. పన్నుల రూపంలో లక్షా 9వేల 992 కోట్లు ఆదాయం సమకూరింది. కేంద్రం నుండి 8వేల619 కోట్ల గ్రాంట్స్ వచ్చాయి. ప్రణాళికేతర వ్యయం 32,979 కోట్లుగా ఉంది. జీతాల కోసం 30వేల 951 కోట్లు వెచ్చించింది. వడ్డీ చెల్లింపుల కోసం 19.161 కోట్లు ఖర్చు చేయగా... మౌలిక వసతులకు 28వేల 308 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది.

Tags:    

Similar News