హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌

Huzurabad: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది.

Update: 2021-10-30 15:45 GMT

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌

Huzurabad: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ చైతన్యాన్ని చాటారు. రాత్రి 7గంటల వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 86.33శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగింసింది. మరోవైపు పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ కూడా తెలియజేశారు.

కరీంనగర్‌లోని డిగ్రీ కాలేజ్‌లో స్ట్రాంగ్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్‌రూమ్‌కు రాష్ట్ర, కేంద్ర పోలీస్‌ బలగాలతో భద్రత ఉంటుంది. 2018తో పోలిస్తే ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం పెరిగింది. పోలింగ్‌ సమయంలో అన్నీ పార్టీలు ఫిర్యాదులు చేసుకోగా కొన్నింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హుజూరాబాద్‌ బైపోల్‌లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 10.5 శాతం పోలింగ్‌ నమోదైంది. 9 గంటల నుంచి 11 గంటల వరకు 33.27శాతం‌, 11 గంటల నుంచి ఒంటి గంట వరకు 45.63 శాతం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు 61.66 శాతం, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల అధికారి తెలియజేశారు.

Tags:    

Similar News