ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ రద్దు అయింది. బ్యాలెట్ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. కంకి కొడవలికి బదులు, సుత్తి కొడవలి ముద్రించడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎస్‌ఈసీ దృష్టికి సీపీఐ ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో పోలింగ్ నిలిపివేయాలంటూ సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్‌పేటలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో ఎల్లుండి రీపోలింగ్ నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఎల్లుండి రీ పోలింగ్ ఉండటంతో ఎగ్జిట్ పోల్స్‌ను ఎస్‌ఈసీ నిషేధించింది.