Rathod Bapu Rao: ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా కేసీఆర్ వెంటే ఉంటా
Rathod Bapu Rao: బీఆర్ఎస్‌లోనే ఉండి.. పార్టీ కోసం పని చేస్తా
Rathod Bapu Rao: తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా.. తాను సీఎం కేసీఆర్ వెంటే ఉంటానన్నారు ఎమ్మెల్యే బాపూరావు. తనకు పదవులు ముఖ్యం కాదని.. కేసీఆర్ ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి... కోట్లాది రూపాయల నిధులతో తన నియోజకవర్గం అభివృద్ధి చేశానన్నారు. అయితే టికెట్ తనకే వస్తుందని ఆశించానని.. అయినప్పటికీ టికెట్ రాకున్నా.. బీఆర్ఎస్‌లో ఉండి పార్టీ కోసం పని చేస్తానని.. పార్టీ ఆదేశానుసారం నడుచుకుంటానన్నారు. కావాలనే కొందరు పని కట్టుకొని.. పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగిస్తున్నారు అని ఎమ్మెల్యే బాపూరావు అన్నారు.