Medak: విధి నిర్వహణలో కఠినత్వం.. కరోనా టైంలో మానవత్వం

Medak: మెదక్‌ జిల్లా రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్‌ ఉదారత * సంకల్ప్‌ ఫౌండేషన్‌ ద్వారా నిరుపేదలకు సాయం

Update: 2021-05-22 08:44 GMT

సహాయం చేస్తున్న సిఐ నాగార్జున గౌడ్

Medak: విధి నిర్వహణలో కఠినత్వం చూపించినా.. తనకంటూ ఓ మంచి మనసుందని చాటి చెప్పుతున్నారు మెదక్‌ జిల్లా రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్‌. తనదైన సేవా దృక్పథంతో పేదవారికి సహాయ సహకారాలు అందిస్తూ.. వారి మనసులు చూరగొంటున్నారు. గత ఏడాది కరోనా వ్యాధి ప్రబలినప్పుడు సంకల్ప్‌ ఫౌండేషన్‌ సంస్థను ప్రారంభించి.. దాతల సహకారంతో నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు నాగార్జున గౌడ్‌.

ఇప్పుడు సెకండ్‌వేవ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు ఉండడంతో.. రామాయంపేట, చిన్న శంకరంపేట, నిజాంపేట మండలాల్లోని గ్రామాలకు ఫౌండేషన్‌ సభ్యులతో కలిసి, కరోనా బారిన పడినవారి ఇళ్లకు స్వయంగా వెళ్లి.. వెయ్యి రూపాయలు ఖరీదు చేసే నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే తనకు ఫోన్‌ చేయాలని, వైద్యపరమైన సౌకర్యాలు అందించేలా కృష్టి చేస్తానని హామీ ఇస్తున్నారు నాగార్జున గౌడ్‌. 

Tags:    

Similar News