Eid Mubarak 2022: నేడే రంజాన్ పండుగ

Eid Mubarak 2022: రంజాన్ ప్రార్థనలకు సిద్దమైన మసీదులు

Update: 2022-05-03 01:45 GMT

Eid Mubarak 2022: నేడే రంజాన్ పండుగ

Eid Mubarak 2022: నెలవంక కనబడటంతో ముస్లింలు ఇవాళ రంజాన్‌ పండుగను జరుపుకోనున్నారు. రంజాన్‌ నెల నేపథ్యంలో ముస్లింలు గత నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. సోమవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ముగిశాయి. రంజాన్‌ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకగా సీఎం అభివర్ణించారు.

హైద‌రాబాద్‌లో రంజాన్ పండుగ వాతావ‌ర‌ణంతో మార్కెట్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరగనుండ‌డంతో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రంజాన్ ప్రార్థన నేప‌థ్యంలో ఇవాళ ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1 వైపు వచ్చే వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్‌కృష్ణా మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

Tags:    

Similar News