నేడు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం

Telangana: ఉప‌రి‌త‌ల‌ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

Update: 2021-04-08 01:42 GMT

Telangana:(Photo the hans india)

Telangana: రాష్ట్రంలో ఒక పక్క మండుతున్న ఎండలు... మరో వైపు ఉరుములతో కూడి వర్షం పలు జిల్లాల్లో పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వింత వాతావరణం నెలకొంది. ఉప‌రి‌త‌ల‌ద్రోణి తమి‌ళ‌నాడు నుంచి కర్ణా‌టక వరకు 0.9 కిలో‌మీ‌టర్ల దాకా ఏర్పడిందని తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీని ప్రభా‌వంతో మంచి‌ర్యాల, జయ‌శం‌కర్ భూపా‌ల‌పల్లి, వరం‌గల్‌ అర్బన్‌, వరం‌గ‌ల్‌‌రూ‌రల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిజా‌మా‌బాద్‌, కామా‌రెడ్డి, సంగా‌రెడ్డి, వన‌పర్తి, నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, జోగు‌లాంబ గద్వాల, వికా‌రా‌బాద్‌ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదే‌శాల్లో గురు‌వారం ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి వర్షం కురిసే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

మరో వైపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఆర్మూర్‌లోని ఇస్సాపల్లెలో 41.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ అతి తక్కువగా ఆదిలాబాద్‌లో 12 శాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది

Tags:    

Similar News