Ashwini Vaishnaw: గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జితో పాటు రైల్వే లైన్ నిర్మాణం
Ashwini Vaishnaw: బెంగాల్‌లోని అసోన్ సోల్ నుంచి వరంగల్ వరకు కొత్త రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
Ashwini Vaishnaw: బెంగాల్‌లోని అసోన్ సోల్ నుంచి వరంగల్ వరకు కొత్త రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. మల్కన్‌గిరి నుంచి పాండురంగాపురం వరకు వయా భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు 7,383 కోట్లతో నూతన రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టామన్నారు. బొగ్గు రవాణా, పవర్ ప్లాంట్‌కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాబోయే ఐదేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయన్నారు.
ఇక గోదావరి నదిపై కూడా ఒక బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. ఏపీలో 85.5 కిలో మీటర్లు, తెలంగాణలో 19 కిలో మీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నామని.. తుపాను వంటి విపత్తుల సమయంలో ఈ లైన్‌లో రైల్వేలు నడుపుతామన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.