Rahul Gandhi TS Tour: రాహుల్ గాంధీ టూర్ లో ట్విస్ట్ లు, వార్నింగ్ లు...

Rahul Gandhi TS Tour: కాంగ్రెస్ నేతలను వణికించిన రాహుల్ హెచ్చరికలు...

Update: 2022-05-08 01:00 GMT

Rahul Gandhi TS Tour: రాహుల్ గాంధీ టూర్ లో ట్విస్ట్ లు, వార్నింగ్ లు...

Rahul Gandhi TS Tour: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన అనుకోని ట్విస్ట్ లు..ఊహించని పర్యటనలతో ముగిసింది. రాహుల్ పర్యటన.. టీకాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ నిప్పింది. ఒకవైపు సెంటిమెంట్. మరోవైపు రాజకీయ దూకుడు.. సొంత నేతలకు హెచ్చరిస్తూ రాహుల్ దూకుడు ప్రదర్శించారు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తమకు అవకాశాన్ని ఇవ్వండని మరోసారి విజ్ఞప్తి చేశారు రాహుల్.

రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. రాహుల్ గాంధీ పర్యటనతో రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త జవసత్వాలు వచ్చాయి. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం రాగా నేతల్లో మాత్రం రాహుల్ హెచ్చరికలు వణుకు పుట్టించాయి. వరంగల్ సభలో టీఆర్ఎస్, బీజేపీలతో ఎలాంటి పొత్తు ఉండదని.. అలాంటి ప్రతిపాదనలు చేసిన నేతలకు పార్టీ నుంచి బహిష్కరణ తప్పదని రాహుల్ హెచ్చరించారు.

రాహుల్ గాంధీ నిన్న హోటల్ తాజ్ కృష్ణాలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రొఫెసర్లతో సమావేశమ్యయారు. ఆ తర్వాత పార్టీకి చెందిన ముఖ్యనేతలతో మాట్లాడి పార్టీ పరిస్థితి పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. ఇక షెడ్యూల్ లో లేదనుకున్న చంచల్ గూడ జైలులో విద్యార్థులతో ములాఖత్ కార్యక్రమం ఊహించని ట్విస్ట్ లతో కొనసాగింది.

చంచల్ గూడ జైలులో రాహుల్ గాంధీతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క NSUI విద్యార్థులతో ములాఖత్ అయి వారికి పార్టీ అండగా ఉంటుందని పోరాటాలు కొనసాగించాలని తెలిపారు. అక్కడి నుండి నేరుగా గాంధీ భవన్ కి వచ్చిన రాహుల్ ఉస్మానియా విద్యార్థులతో ముచ్చటించారు.

గాంధీ భవన్ లో రాహుల్ దాదాపు 300 పార్టీ ముఖ్యనేతలతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఇందులో పార్టీ బలోపేతం, పార్టీ పటిష్టత పలు అంశాలపై దిశా నిర్ధేశం చేశారు. కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత అవసరమని..ఐక్యత తోనే అధికారంలోకి వస్తామని నేతలకు తేల్చిచెప్పారు. టికెట్లు మెరిట్ బేస్ పైనే ఇస్తామని..టికెట్ల కోసం ఢిల్లీ అసలే రావద్దని హైదరాబాద్ లో ఉండద్దని రాహుల్ సూచించారు.

రాహుల్ పర్యటనతో పార్టీకి కొత్త జవసత్వాలు రావడమే కాకుండా నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరి రాహుల్ సూచనలు పాటిస్తూ హస్తం పార్టీ నేతలు ముందుకు వెళ్తారా...మళ్ళీ మొదటికొస్తారా చూడాలి.

Tags:    

Similar News