Bhatti Vikramarka: ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ బాధ్యతలు తీసుకోకతప్పదు
Bhatti Vikramarka: ప్రస్తుతం పరిస్థితుల్లో రాహుల్ బాధ్యతలు తీసుకోకతప్పదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
Bhatti Vikramarka: ప్రస్తుతం పరిస్థితుల్లో రాహుల్ బాధ్యతలు తీసుకోకతప్పదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గాంధీ కుటుంబం వల్లే కపిల్ సిబల్ కేంద్ర మంత్రిగా పని చేశారన్నారు. సీఎల్పీ సోనియా నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా... పదవులకు దూరంగా, పార్టీ బలోపేతం కావాలని చూశారన్నారు. మర్రి శశిధర్ నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. దేశ రక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కపిల్ సిబల్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి గాంధీ కుటుంబం తప్పుకోవాలని కోరారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం విన్పిస్తున్న G-23 నేతలు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీ లోని జీ 23కి నాయకత్వం వహిస్తున్న గులాం నబీ ఆజాద్ నివాసంలో కపిల్ సిబల్, మనీష్ తివారీ తదితరులు భేటీ అయ్యారు.