ఈనెల 24 నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్ర
*15 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్
Telangana: రాహుల్ గాంధీ జోడోయాత్రకు భారత్ జోడో యాత్రకు టీ కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీకాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరుగనుంది.. జోడో యాత్ర ఈనెల 24న తెలంగాణలోకి రానున్నందున దీనికి సంబంధించిన మినిట్ టూ మినిట్ రూట్ మ్యాపును కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. మక్తల్ నుంచి జుక్కల్ వరకు పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దాదాపు 15 రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. దాదాపు 350 కిలోమీటర్ల మేర ఉండనున్న ఈ యాత్రలో రాహుల్ గాంధీతో రోజుకో టీం ఉండేలా కార్యాచరణ రూపొందించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి ఇంచార్జిగా ఉండడంతో పాటు అన్నీ తానై నడిపిస్తున్న దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కొప్పుల రాజు తెలంగాణ రూట్ మ్యాప్ కోసం అక్టోబర్ 3వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు.. 4వ తేదీన ఉదయం కర్నూలులో సమావేశం నిర్వహించి, గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో ఈ ముగ్గురు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణకు అదనంగా రెండు రోజులు కేటాయించాలని పీసీసీ కోరుతున్నారు. రాహుల్ గాంధీ జోడోయాత్రలో ఆయన ఎవరెవరిని కలవాలి... ఇక్కడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతోపాటు టీఆర్ఎస్ వైఫల్యాల గురించి రాహుల్ గాంధీతో చెప్పించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.