సైబర్ నేరలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర కేటుగాడు అరెస్ట్

Cyber Crime: బ్యాంక్ అకౌంట్‌లోని రూ.33 లక్షల నగదు ఫ్రీజ్...

Update: 2022-03-05 06:45 GMT

సైబర్ నేరలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర కేటుగాడు అరెస్ట్

Cyber Crime: ఈ - కామర్స్ వెబ్‌సైట్‌లో షాపింగ్ చేస్తున్న వారిని టార్గెట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను పట్టుకున్నారు రాచకొండ పోలిసులు. నిందితుడు బీహార్‌కు చెందిన సలీంగా గుర్తించారు. సలీంపై బీహార్, తెలంగాణ, ఢీల్లీలో 22 కేసులు ఉన్నాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఇక నిందితుడి నుంచి 3లక్షల 50 వేల నగదు, 4 సెల్ ఫోన్స్, తొమ్మిది సిమ్ కార్డ్స్, రెండు డెబిట్ కార్డ్స్, బ్యాంక్ ఖాతాలు 5, నాలుగు చెక్ బుక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోని, బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న 33లక్షలను నగదును ఫ్రీజ్ చేశామన్నారు సిపి మహేష్ భగవత్. అలాగే ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో కేటుగాడిని సైతం అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 23 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Tags:    

Similar News