Puvvada Ajay Kumar: ఖమ్మం ప్రజలను వదిలి వెళ్లేదే లేదు
Puvvada Ajay Kumar: కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తాననేది అవాస్తవం
Puvvada Ajay Kumar: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. తాను ఖమ్మంలోనే ఉంటానని.. ఖమ్మం ప్రజలను వదిలి వెళ్లేదే లేదని స్పష‌్టం చేశారు. తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేయనని చెప్పారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తాననేది అవాస్తవమని చెప్పారు. తన ప్రత్యర్థులను కూకటివేళ్లతో పెకిలిస్తానని ధీమా వ్యక్తం చేశారు.