ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో నిలిచిన కొనుగోళ్లు

* ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య విభేదాలు... ట్యాక్స్ తప్పించేందుకు కొనుగోలు

Update: 2022-11-17 07:20 GMT

ఖమ్మం వ్యవసాయ మిర్చి మార్కెట్లో నిలిచిన కొనుగోళ్లు

Farmers Market: ఖమ్మం వ్యవసాయ మిర్చీ మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోవడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిది. మార్కెట్‌లో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మిర్చి కొనుగోళ్లు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఒక్కసారిగా విభేదాలు బయటపడ్డాయి. ట్యాక్స్ తప్పించేందుకు కొనుగోలుదారుల ఎత్తులను ఓటమి చెందిన వర్గం బహిర్గతం చేయడంతో గెలిచిన వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్ ధర 21వేలు ఉండగా 8వేలేనంటూ మార్కెట్ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు ట్యాక్స్ కట్టని 4 లారీల మిర్చిని మార్కెట్ వర్గాలు పట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఏం చేయాలో తెలియని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News