రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉత్పత్తి పునఃప్రారంభం

*ఎరువుల డిమాండ్ దృష్ట్యా ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీపీసీబీ

Update: 2022-05-31 03:26 GMT

రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉత్పత్తి పునఃప్రారంభం

Peddapalli: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజరస్ కెమికల్స్ లిటిటెడ్ లో ఉత్పత్తి పున ప్రారంభం అయ్యింది. కాలుష్య నియంత్రణ చర్యల కోసం తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును యాజమాన్యం సమయం కోరింది. ఎరువుల డిమాండ్ దృష్ట్యా ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల ఉత్పత్తిని నిలిపివేయాలంటూ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం సోమవారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యం అధికారులతో సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం దేశంలో ఎరువుల వాడకం పెరగడంతో యూరియా డిమాండ్‌ పెరిగింది.

ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సమస్యల పరిష్కారానికి సమయం కోరారు. ఇందుకు పీసీబీ అధికారులు సానుకూలంగా స్పందించడంతో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుందని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News