ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఘరానా మోసం.. ప్రయాణికుల లగేజీతో పరార్

* 64 మంది కూలి పనుల నిమిత్తం కేరళలో పని చేసుకుని వారి సొంత ఊరైన అస్సాం, కోల్‌కతా, బీహార్‌కు బయల్దేరారు.

Update: 2021-11-06 09:58 GMT

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ఘరానా మోసం(ఫైల్ ఫోటో)

Nalgonda: నల్ల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ ప్రయాణికులను మోసం చేసి పరారయ్యారు. డ్రైవర్ మోసంతో నార్కట్‌పల్లిలో చిక్కుకుపోయారు అస్సోం, బీహార్ రాష్ట్రాలకు చెందిన 64 మంది కూలీలు. హోటల్‌లో వదిలేసి బస్సు తీసుకొని పరారయ్యాడు డ్రైవర్. 64 మంది కూలి పనుల నిమిత్తం కేరళలో పని చేసుకుని వారి సొంత ఊరైన అస్సాం, కోల్‌కతా, బీహార్‌కు బయల్దేరారు.

అయితే వీరంతా కలిసి రెండు బస్సులను మాట్లాడుకుని కేరళ నుండి బయల్దేరారు. అయితే 64 మందిని ఒకే బస్సులో పంపించి వారిని కూడా గమ్యస్థానం చేర్చకుండా నిన్న మధ్యాహ్నం 12 గంటలకి భోజనానికి అని హోటల్ ముందు బస్సు ఆపేశాడు. మీరు భోజనం చేయండి బస్ టైర్ పంచర్ చేపించుకొని వస్తానని చెప్పి వదిలేసి వెళ్లిపోయారు.

ప్రయాణికులకు సంబంధించిన బట్టలు, డబ్బులు అన్ని బస్సులోనే ఉండటంతో వారికి ఎలాంటి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారికి భోజనం ఫంక్షన్ హాల్ లో ఆశ్రయం కల్పించి సొంత ఊర్లకు పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News