షర్మిలకు వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్
*కేంద్ర పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయంటూ ప్రచారం *త్వరలో చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర *రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
షర్మిల పార్టీ నిర్ణయం వెనుక వైఎస్ ప్రధాన అనుచరులు, సన్నిహితులు ఉన్నట్లు తెలుస్తోంది. కేవీపీ, వైఎస్ఆర్ నమ్మిన బంటు సూరీడు షర్మిలతో పయనమవుతున్నట్లు సమాచారం. ఇక కేంద్ర పెద్దల నుంచి షర్మిలకు ఆశీస్సులు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. రూట్ మ్యాప్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.