తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపుపై కీలక నిర్ణయం

Traffic Challans: మరో 15 రోజులు చలాన్లు చెల్లించేందుకు ఛాన్స్

Update: 2022-03-31 02:00 GMT

తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపుపై కీలక నిర్ణయం 

Traffic Challans: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15రోజులు పొడిగించారు. మార్చి 1 నుండి 31 వరకు ఉన్న గడువు మరో పక్షం రోజులు పెరిగింది. ఈమేరకు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు కోట్ల 40లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయి. 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకున్నారు. 52శాతం మోటారు వాహన యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.

రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి వారు ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా మంత్రి కోరారు..

టూవీలర్, త్రీ వీలర్ వాహనదారులకు 25శాతం, ఆర్టీసీ 30శాతం, ఎల్.ఎం.వీ, ‌హెచ్.ఎం.వీ 50శాతం , తోపుడు బండ్ల వ్యాపారలు 20శాతం, నో మాస్క్ కేసులు వంద రూపాయలు చెల్లించాలని ప్రకటించారు. మోటారు వాహన యజమనులు అన్ని ఆన్‌ లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లించేందుకు మరోసారి గడువు ఇచ్చారు.

Tags:    

Similar News