Nagarjuna Sagar By Elections: నాగార్జున ‌సాగర్‌లో రసవత్తరపోరు

Nagarjuna Sagar By-Elections: నామినేషన్ దాఖలులోనూ ఉత్కంఠ * ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించని టీఆర్‌ఎస్, బీజేపీ

Update: 2021-03-29 08:05 GMT

Nagarjuna Sagar By-Elections: నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది. అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు సస్పెన్స్ మెయింటెన్స్ చేస్తున్నాయి. ఎక్కడ బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచుతున్నాయి. రేపటితో నామినేషన్ గడువు ముగుస్తుండడంతో కాంగ్రెస్ మినహా, ప్రధాన పార్టీలు ఇప్పటికీ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. దాంతో నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి టికెట్‌ దక్కుతుందోనని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పేరు ఖరారు చేసినప్పటికి నామినేషన్ దాఖలు చేయలేదు.

చివరి రోజైన రేపు నామినేషన్లు భారీగా దాఖలు చేయనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ తమ అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించినా నామినేషన్ వేయలేదు. చివరి రోజు వరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా కార్యకర్తల్లో, నేతల్లో ఉత్కంఠను రేపుతున్నారు. మరోవైపు ఒక పార్టీ ఓ సామాజికవర్గానికి టికెట్‌ ఇస్తే మరో పార్టీ ఇంకొ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. కులాల వారీగా ఓట్లు చీల్చే పనిలో పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News