Telangana: నిరసన చేస్తున్న అమ్మాయి జుట్టు పట్టి లాగి పడేసిన పోలీసులు
Telangana: అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు హైకోర్టు కేటాయించవద్దంటూ.. గత కొన్ని రోజులుగా శాంతియుంతంగా విద్యార్థుల నిరసన
Telangana: ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 55కి నిరసనగా గత కొంతకాలం నుండి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూములను హై కోర్టుకు ఇవ్వొద్దు, తక్షణమే జీవో 55ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అంటూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసారు. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషంగా ఉంది.
ఒక మహిళా విద్యార్థినిని స్కూటీ మీద ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వెంబడిస్తూ ఆమె జుట్టు పట్టి ఈడ్చుకొని వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. సాటి మహిళా అయ్యుండి కూడా ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం మానవీయ కోణంలో లేదని నెటిజెన్స్ మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుకునేందుకు కూడా స్వేచ్ఛ లేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.