తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న పోలీసులు

Telangana: ఇప్పటికే వెయ్యి మందితో రాష్ట్ర వ్యాప్తంగా నూతన విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటన, హైదరాబాద్ సిటీలో కొత్తగా నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్.

Update: 2022-02-02 06:03 GMT

తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్న పోలీసులు

Telangana: తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే వెయ్యి మందితో రాష్ట్ర వ్యాప్తంగా నూతన విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ సిటీలో కొత్తగా నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు సీపీ. అడిషనల్ డీసీపీ, ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌లతో నిరంతరం డ్రగ్స్‌పై నిఘా పెట్టనున్నారు.

ఇప్పటికే ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లను నియమిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు రమేష్‌రెడ్డిలను నియమిస్తూ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. డ్రగ్స్‌ను వెంటనే పసిగట్టే అత్యాధునిక పరికరాలను పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News