Telangana: పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు
Telangana: తెలంగాణ ప్రపంచ పటంపై మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది.
Telangana: తెలంగాణ ప్రపంచ పటంపై మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ పర్యాటక సంస్థల జాబితాలో పోచంపల్లి గ్రామానికి చోటు దక్కింది. ఈ పురస్కారానికి భారత్ నుంచి మూడు గ్రామాలుపోటీ పడగా ఎట్టకేలకు భూదాన్ పోచంపల్లి ఆ గుర్తింపును దక్కించుకోగలగింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ వస్త్రాలకు ఇప్పటికే ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఐక్య రాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లికి చోటు దక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
పోచంపల్లికి గుర్తింపు దక్కేలా కృషి చేసిన మంత్రిత్వ శాఖ అధికారులను కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఇప్పటికే రామప్ప కు అంతర్జాతీయ గుర్తింపు దక్కగా ఇప్పుడు పోచంపల్లికి కూడా గుర్తింపు దక్కడంపై తెలంగాణ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 2న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో అవార్డు ప్రదానం జరుగుతుంది.