PM Narendra Modi: సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు..

Narendra Modi: సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Update: 2022-11-12 12:54 GMT

PM Narendra Modi: సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు..

Narendra Modi: సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో RFCL ఫ్యాక్టరీతోపాటు పలు రైల్వే స్టేషన్లను, 3 జాతీయ రహదారుల విస్తరణ పనలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభిచారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల రైతులకు ఎరువుల కొరత తీరిందన్న మోడీ.. ఈ ఫ్యాక్టరీతో ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇక సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కొందరు హైదరాబాద్ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను ప్రవేటుపరం చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా కేంద్రానికి 49 శాతం వాటా ఉందని గుర్తు చేశారు. బొగ్గు గనులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పుకార్లను నమ్మవద్దన్నారు.

Full View


Tags:    

Similar News