PIL Against Secretariat Demolition: సచివాలయం కూల్చివేతపై హై కోర్టులో పిల్..
PIL Against Secretariat Demolition: పాత సచివాలయ భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుంచి సచివాలయం కూల్చివేత పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే.
PIL Against Secretariat Demolition: పాత సచివాలయ భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుంచి సచివాలయం కూల్చివేత పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని చాలెంజింగ్ గా తీసుకుని సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని బుధవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ చేసింది. భవనాల కూల్చివేత వల్ల వాతావరణం కాలుష్యం అవుతుందోని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశర్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ ధాఖలు చేశారు.
మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ భవనాలను అధికారులు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ కూల్చివేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ వాదనను విన్న హై కొర్టు స్పందిస్తూ ఈ విషయంపై అత్యవసరంగా విచారించలేమని స్పష్టం చేసింది. 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలికి కూల్చివేతల వల్ల ఆటంకం కలుగుతుందని అభిప్రాయపడింది. ఇక సెక్రటేరియట్ లో ఏ, బీ, సీ, డీ, జీ, జే, కే, ఎల్, నార్త్ హెచ్, సౌత్ హెచ్ బ్లాకుల భవనాలు ఉండగా, మంగళవారం సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు సచివాలయం పక్కన ఉన్న రాతిభవనం కూల్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయి.
ఇక పోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తరువాత సచివాలయం తొలి పాలనా కేంద్రమైంది. మొత్తం 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా వెలసిల్లిన సచివాలయాన్ని నిజాంలు 25 ఎకరాల విస్తీర్ణంలో 10లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ కట్టడాన్ని నిర్మించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా ఉన్న సైఫాబాద్ ప్యాలెస్ లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్ మాదిరిగా నిర్మించబడింది. నిజాంకు ఖాజానాగా ఉపయోగపడిన భవనాన్ని, ప్రస్తుతం సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 10 బ్లాకులుగా నిర్మించారు.