Ganesh Nimajjanam 2022: రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా నిమజ్జనోత్సవం

Ganesh Nimajjanam 2022: ఘనంగా వీడ్కోలు పలికిన భక్తజనం

Update: 2022-09-10 02:03 GMT

Ganesh Nimajjanam 2022: రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా నిమజ్జనోత్సవం

Ganesh Nimajjanam 2022: తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ గణేశ్‌ నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. నవరాత్రులు వైభవంగా పూజలందుకున్న గణపతులు గంగమ్మ ఒడికి తరలివెళ్తున్నారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, యువతీ యువకుల నృత్యాల నడుమ శోభాయాత్ర కనులపండువగా సాగుతోంది. ఊరువాడా నిమజ్జనోత్సవ సందడి నెలకొంది.

మహబూబ్‌నగర్ జిల్లాలో గణేశ్ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. తొమ్మిది రోజులు ధూపదీప నైవేద్యాలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి తరలి వెళ్లాడు. జిల్లా కేంద్రంలో భారీ గణనాథులను గద్వాల జిల్లా బీచ్‌పల్లిలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. అటు చిన్న గణపతులను మున్సిపాలిటీ అధికారులు సేకరించి లారీలో బీచ్‌పల్లికి తరలించి నిమజ్జనం చేశారు. గణపతి నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ దగ్గర గణేష్ ఉత్సవ నిమజ్జన స్వాగతం వేదికను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News