కేంద్ర ప్రభుత్వం 5.0 అన్ లాక్ మార్గదర్శకాలను విడుదల చేసింది. దానిలో ప్రదానంగా పాఠశాలలు ప్రారంబించుకోవచ్చు అని సూచించింది. ఆక్టోబర్ 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నిర‌్ణయం తీసుకొని స్కూళ్లు ప్రారంభం చేసుకోవచ్చని సూచించింది. ఈ నేపద్యంలో తెలంగాణలో స్కూళ్లు స్టార్ట్ అవుతాయా లేదా అనే మీమాంస కొనసాగుతుంది.
బడులు తెరిచేందుకు కేంద్రప్రభుత్వం సూచించినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడులకు పంపించే ప్రసక్తే లేదని కరాఖండీగా చెప్తున్నారు. విద్యా సంవత్సరం నష్టమైనా పరవాలేదు కానీ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడలేమని తెగేసి చెప్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం బడులు తెరుచుకోడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ స్కూళ్లు పునఃప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఆన్ లైన్ క్లాసులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహణకు చాలా తేడా ఉందని అంటున్నారు.